News May 2, 2024
నిజామాబాద్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును మే 4వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మరో రెండు రోజులు ఫీజు గడువును పొడిగించామని తెలిపారు.
Similar News
News April 5, 2026
కలెక్టరేట్‌లో రేపు, ఎల్లుండి ఎన్‌సీడీ స్క్రీనింగ్

నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో ఏప్రిల్ 6, 7 తేదీలలో ఎన్‌సీడీ(అంటువ్యాధులు కానివి) స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కలెక్టరేట్ ఉద్యోగులు తమ ఆధార్ కార్డుతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News April 5, 2026
మెండోర: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

మెండోర మండలం సోన్ పేట్‌కు చెందిన పిండి మధు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై గడ్డిమందు తాగాడు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.
News April 5, 2026
NZB: నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి: కవిత

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత ఆదివారం X వేదికగా డిమాండ్ చేశారు. వడగళ్ల వాన బోధన్ నియోజకవర్గ రైతులకు కన్నీటిని మిగిల్చిందని సాలూర, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు.


