News December 25, 2025
నిజామాబాద్: ఇండో-నేపాల్ రుద్రాక్ష నూతన శాఖ ఏర్పాటు

ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు వేద గణిత శాస్త్రవేత్త డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇండోనేపాల్ ఆర్గనైజేషన్ నూతన శాఖను నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కేశవ్ వేణు గురువారం ప్రారంభించారు. పాండురంగారావు మాట్లాడుతూ.. ఈ శాఖలో అరుదైన రుద్రాక్షలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ రాజారెడ్డి, సినీ రచయిత సతీశ్ పాల్గొన్నారు.
Similar News
News December 26, 2025
ADB: వివాహితకు యువకుడి వేధింపులు.. SUICIDE

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్‌లో చోటుచేసుకుంది. SI శ్రీ సాయి తెలిపిన వివరాలు.. మండలంలోని సాకెర గ్రామానికి చెందిన జాదవ్ స్రవంతి (30)ని అదే గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ రెండేళ్లుగా భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదైంది.
News December 26, 2025
NLG: LOVE AFFAIR.. భర్తను హత్య చేసిన టీచర్

ఓ ప్రభుత్వ టీచర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. CI నాగరాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్-పద్మ దంపతులు అచ్చంపేటలో నివాసముంటున్నారు. పద్మకు తోటి ఉపాధ్యాయుడు గోపితో ఏర్పడిన సంబంధం భర్త హత్యకు దారితీసింది. గత నెల 25న లక్ష్మణ్‌ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం స్పృహతప్పి పడిపోయినట్లు నాటకమాడగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్ చేశారు.
News December 26, 2025
వికారాబాద్: అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ బదిలీ

వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో రెవిన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్‌ను రాష్ట ఎన్నికల కమిషన్ సెక్రటరీగా నియమించింది.


