News May 4, 2024

నిజామాబాద్: ఎంపీ అర్వింద్‌పై చార్జిషీట్

image

TPCC ఎన్నారై సెల్, గల్ఫ్ కార్మికుల ఆధ్వర్యంలో MP అర్వింద్‌పై చార్జిషీట్ విడుదల చేశారు. డిచ్‌పల్లి(M)లోని ఓ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో భారతీయులకు ఇస్తున్న వేతనాలను, BJP 30-50 శాతం వరకు తగ్గిస్తూ సర్క్యూలర్లను జారీ చేసి కార్మకులు పొట్ట కొట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం ఆన్‌లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

Similar News

News October 1, 2024

నీట్ పరీక్షల్లో కామారెడ్డి విద్యార్థుల ప్రతిభ

image

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన చెప్యాల సునైనరెడ్డి రాష్ట్ర స్థాయిలో 272వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మరొక విద్యార్థిని సంజన రాష్ట్ర స్థాయిలో 4,148వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పలువురు అభినందించారు.

News October 1, 2024

అక్టోబర్ 8-10 వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

image

కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జల శక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను అధికారులు పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 30, 2024

కామారెడ్డి జిల్లా టాపర్‌గా పిట్లం యువతి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.