News February 24, 2026

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కీలక బాధ్యత

image

భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్‌గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం. కమిటీలో రంజన్ గొగోయ్, రణదీప్ సుర్జేవాలా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 25, 2026

సిద్దిపేట: అవ్వా.. వ్యాపారం ఎట్లుంది: హరీశ్ రావు

image

సిద్దిపేట పట్టణంలోని మోడల్ రైతు బజార్‌ను హరీశ్ రావు రాత్రి సందర్శించారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడుతూ అవ్వా.. వ్యాపారం ఎట్లుంది అని మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు కలకుండా చూడాలని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు.

News February 25, 2026

విజయ్-రష్మికలను ఆశీర్వదిస్తూ మోదీ లేఖ

image

పెళ్లి పీటలెక్కబోతున్న విజయ్ దేవరకొండ, రష్మికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు ఆహ్వానంపై ఆయన స్పందిస్తూ ఇరు కుటుంబాలకు విషెస్ తెలియజేశారు. వారి వైవాహిక జీవితం వెండితెర మ్యాజిక్‌ను మించి అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. జీవితాంతం స్నేహితులుగా కలిసి మెలసి ఉండాలని ఆశీర్వదించారు. రేపు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరగనుంది.

News February 25, 2026

నిర్మల్: విద్యార్థుల సామర్థ్యాలపై ‘ఎఫ్ఎల్ఎన్’ సర్వే

image

జిల్లాలోని ఎంపిక చేసిన 53 ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ‘ఎఫ్ఎల్ఎన్’ (FLN) శాంపిల్ సర్వే ప్రారంభమైంది. రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం అంశాల్లో ఉన్న కనీస సామర్థ్యాలను అధికారులు పరిశీలించనున్నారు. సర్వే నిర్వహణకు డైట్ చాత్రోపాధ్యాయులను ఇప్పటికే నియమించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యం.