News December 16, 2025
నిజామాబాద్: ఎన్నికలు.. 11 గన్లు డిపాజిట్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల వద్ద ఉన్న గనులను డిపాజిట్ చేయాల్సిందిగా సీపీ సాయి చైతన్య ఆదేశించారు. మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్స్‌లు ఉండగా వారిని డిపాజిట్ చేయమన్నామన్నారు. ఇందులో నుంచి 11 గన్లు తమవద్ద డిపాజిట్ అయ్యాయని, మిగతా 7 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినవని కమిషనర్ వివరించారు.
Similar News
News April 5, 2026
NZB: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే!

గడచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. వేంపల్లె, నిజామాబాద్ సౌత్ 40.1°C, కోటగిరి 40°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని అన్నిప్రాంతాల్లో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న సాయంత్రం జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. జానకంపేటలో 26.8 మి.మీ, సిరికొండ, సాలూరలో 10 మి.మీ. వర్షం కురిసింది.
News April 5, 2026
NZB: హస్తంలో రగులుతున్న రాజకీయ సెగలు

నిజామాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న ధర్మపురి సంజయ్‌కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన గుర్తింపు దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్న అభిమానులు, నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. బలమైన ఓటు బ్యాంకు కలిగిన నేత కావడంతో, ఆయన పార్టీ వీడితే నష్టం తప్పదని కేడర్ ఆందోళన చెందుతోంది.
News April 4, 2026
NZB: ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: DRDA PD

NZB జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి నిర్వహించే ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని DRDA PD సాయగౌడ్ ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని డిపార్ట్‌మెంట్లు అవసరమైన మేరకు కోఆర్డినేషన్ అందించి పరీక్షలను సజావుగా జరిగేలా సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో DEO అశోక్, DMHO రాజశ్రీ, ACP తదితరులు పాల్గొన్నారు.


