News December 23, 2024

నిజామాబాద్ కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు

image

తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Similar News

News December 23, 2024

NZB: ‘చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి’

image

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విషాహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.30,000 బాకీ పడ్డారని వాటిని కూడా చెల్లించాలన్నారు.

News December 23, 2024

NZB: పదవులు శాశ్వతం కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్: KA పాల్

image

తన మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారని, ముఖ్యమంత్రి తనను వాడుకొని వదిలేశారని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్’ అని అన్నారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలవి పచ్చి అబద్ధాలు అని విమర్శించారు.

News December 23, 2024

NZB: విధులకు గైర్హాజరుపై మంత్రి ఫైర్

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులపై మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. నిత్యం 50 శాతం మంది డాక్టర్లు కూడా ఆసుపత్రిలో పనిచేయడానికి రాకపోతే.. సూపరింటెండెంట్‌గా ఏం చేస్తున్నారని ప్రతిమారాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ భవనాన్నిమంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.