News February 23, 2026

నిజామాబాద్: కానిస్టేబుల్ సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం

image

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె తమ్ముడు గాజుల శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు. ​ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సౌమ్య కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా అందజేశారు. మాట ఇచ్చిన నెల రోజుల్లోపే ఉద్యోగం, ఆర్థిక సాయం అందించారు.

Similar News

News February 24, 2026

‘వాల్తేరు రైల్వేకు అదనపు ఆదాయం’

image

వాల్తేరు డివిజన్ తన టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచేందుకు 10 WAP-7 ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లపై ప్రకటనల కోసం ఢిల్లీ సంస్థతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఏడాదికి రూ.7 లక్షలకు పైగా, మొత్తం మీద రూ. 26 లక్షల ఆదాయం లభిస్తుందని డీఆర్ఎం పవన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంజిన్లపై జొమాటో వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తున్నాయి.

News February 24, 2026

హనుమకొండ: రోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ పెంచండి: CP

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమం ద్వారా పోలీస్ అధికారులు వారివారి స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిగే నష్టాలపై ప్రజలకు అవెర్నెస్ కల్పించాలని వరంగల్ CP అధికారులను అదేశించారు. అలాగే కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించాలన్నారు.

News February 24, 2026

హోలీ పండుగ ఎప్పుడంటే?

image

ఈ ఏడాది హోలీని ఏ తేదీన(మార్చి 3 or 4) జరుపుకోవాలన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ధ్రుక్ పంచాంగం ప్రకారం హోలికా దహనం మార్చి 3న, రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2న సాయంత్రం 5.55 నుంచి మార్చి 3 సా.5.07 వరకు ఉంటుందంటున్నారు. అయితే 3వ తేదీన చంద్ర గ్రహణం ఉండటం వల్ల 4న పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు.