News August 25, 2025
నిజామాబాద్: కార్మికుల సంక్షేమం ప్రాధాన్యం

ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ సర్వే కమిటీ సమావేశం జరిగింది. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, ప్రయోజనాల గురించి సూచనలు చేశారు.
Similar News
News August 25, 2025
NZB: ప్రజావాణికి 102 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
News August 25, 2025
SRSP UPDATE: తగ్గిన ఇన్ ఫ్లో.. వరద గేట్ల మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గడంతో సోమవారం మధ్యాహ్నం వరద గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 29,907 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోందని, దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ కాలువకు 20 వేలు, కాకతీయ కాల్వకు 3,500, సరస్వతి కాల్వకు 500, లక్ష్మీ కెనాల్‌కు 150, అలీ సాగర్ లిఫ్ట్‌కు 360 క్యూసెక్కుల నీరు వదులుతున్నామన్నారు.
News August 25, 2025
NZB: విగ్రహాలు తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: CP

గణేశ్ మండలి నిర్వహకులు విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ CP సాయి చైతన్య సూచించారు. కొన్ని రోజులుగా 4 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని, వాటిలో 9 మంది యువకులు మరణించారని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల రవాణా, స్థాపించే మండపాల వద్ద ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు.