News March 20, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు నిజామాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం కామారెడ్డిలోనూ వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
SHARE IT

Similar News

News February 6, 2026

నిజామాబాద్: బాధ్యత మీదే.. గెలిచి తీరాలి: సీఎం

image

​నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థులతో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత అభ్యర్థులదేనని స్పష్టం చేశారు. ​మహిళా అభ్యర్థులు సగం మంది ఉండటం కలిసొచ్చే అంశం అన్నారు. ​సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. ​అభ్యర్థులు నిర్లక్ష్యం వీడి ప్రతి ఓటును కీలకంగా భావించాలన్నారు. ​విద్వేషాలు రెచ్చగొట్టే ప్రతిపక్షాల మాటలకు అభివృద్ధి పనులతోనే సమాధానం చెప్పాలన్నారు.

News February 6, 2026

NZB: రిటైర్డ్ ఉద్యోగులు.. దశాబ్దాల అనుభవానికి నిలువుటద్దాలు: పీసీసీ చీఫ్

image

రిటైర్డ్ ఉద్యోగులు అంటే కేవలం బాధ్యతల నుంచి విరమణ పొందిన వారు కాదని, దశాబ్దాల అనుభవానికి నిలువుటద్దాలు అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో విశ్రాంత ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలనలో కీలక పాత్ర పోషించిన వారి సంక్షేమం తమ బాధ్యత అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

News February 6, 2026

NZB బయలుదేరిన ముఖ్యమంత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYD బేగంపేట విమానాశ్రయం నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌కు బయలుదేరారు. CMతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు NZB జిల్లా పర్యటనకు రానున్నారు. CM NZB జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొంటారు.