News August 25, 2025

నిజామాబాద్: జిల్లాకు రెండు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కళాశాలలు

image

NZB జిల్లాకు మైనారిటీ గురుకుల విద్యా సంస్థల(టెమ్రిస్) ఆధ్వర్యంలో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ కార్యదర్శి షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి బాలుర కోసం నాగారంలో, మరొకటి బాలికల కోసం ధర్మపురి హిల్స్‌లోని మదీనా ఈద్గాలో ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా అధికారి బషీర్ తెలిపారు.

Similar News

News August 24, 2025

NZB: మెడికల్ కాలేజీలో దాడి.. ర్యాగింగ్ కలకలం?

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్లు (హౌస్ సర్జన్స్) ర్యాగింగ్‌కు పాల్పడి దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా ర్యాగింగ్, దాడి ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతున్నామని NZB వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు.

News August 24, 2025

UPDATE: వడ్డీ వ్యాపారులపై దాడుల్లో పట్టుబడినవి ఇవే: CP

image

నిన్న NZB జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వాటి వివరాలను CP వెల్లడించారు. NZB డివిజన్లో రూ. 1,21,92,750 నగదు, రూ.10.14 కోట్ల విలువైన 137 చెక్కులు, రూ.7.10 కోట్ల విలువైన 170 ప్రామిసరీ నోట్లు, ఆర్మూరులో 324 ప్రామిసరీ నోట్లు, వాటి విలువ రూ.4.97 కోట్లు, రూ.1.85 కోట్ల బాండ్లు, రూ.30.36 లక్షల 62 చెక్కులు స్వాధీనపర్చుకున్నారు.

News August 24, 2025

ఆర్మూర్: దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు: డీఈఓ

image

దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా విద్యాధికారి అశోక్ సూచించారు. శనివారం ఆర్మూర్‌లో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులను శిబిరానికి రప్పించడంలో కృషి చేసిన IERPలను అభినందించారు.