News March 22, 2025

నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 23, 2025

నిజామాబాద్‌లో పలువురి ఘర్షణ

image

నిజామాబాద్ నగరంలో ఆదివారం కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగగా కత్తి పోట్లు జరిగాయని పుకార్లు షికార్లు చేశారు. వివరాల్లోకి వెళితే మిర్చి కాంపౌండ్‌లో హబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్‌కు మిర్చీ కాంపౌండ్‌కు చెందిన అజ్జుకు, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో మహమ్మద్‌కు అక్కడ ఉన్న ఓ ఇనుప రాడ్డు గుచ్చుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2025

నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్‌పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్‌పల్లె, మదన్‌పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 23, 2025

NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

image

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!

error: Content is protected !!