News January 1, 2026

నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వరి సాగు

image

ఈ యాసంగిలో రాష్ర్టంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే వరి నాటు వేశారు. జిల్లా మొత్తం 1.67 లక్షల ఎకరాల్లో వరి నాటినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. మొక్కజొన్న, పసుపు, సోయా, పత్తి, కూరగాయలు అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 2.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలో 47,905 ఎకరాల్లో వరి నాటారు. పలుచోట్ల ఇంకా నాట్లు వేస్తున్నారు. కూలీల కొరత ఇబ్బంది పెడుతోందని రైతులు చెప్పారు.

Similar News

News January 1, 2026

డిసెంబర్ GST వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

image

డిసెంబర్ 2025లో భారత GST వసూళ్లు 6.1% వృద్ధి చెంది ₹1.75 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 19.7% పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశీయంగా మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలు బలమైన వృద్ధిని కనబరచగా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లో తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం వసూళ్లు 8.6% పెరిగి ₹16.50 లక్షల కోట్లకు చేరడం భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తోంది.

News January 1, 2026

నాగర్ కర్నూల్: ‘స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి’

image

నాగర్ కర్నూల్ 2024-25 విద్యా సంవత్సర పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్‌లకు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి తెలిపారు. epass.cgg.gov.in వైబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కులం, ఆదాయం ధ్రువ పత్రాలతో పాటు ఆధార్ నంబర్ అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలని సూచించారు.

News January 1, 2026

జీడిమామిడి పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.