News August 25, 2025
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు దారుణహత్య

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మాక్లూర్ మండలం ధర్మోరలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. గౌతమ్‌నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్, తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ధర్మోరకి వెళ్లాడు. అక్కడ వారి కళ్లల్లో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 25, 2025
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగలను భక్తి భావంతో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ సంవత్సరం ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అలర్ట్ ఉండాలన్నారు.
News August 25, 2025
స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

AP: RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. 11,702మంది ఎంపిక కాగా, ఆగస్టు 31లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. ఈ <
News August 25, 2025
NZB: ప్రజావాణికి 102 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.