News September 4, 2024
నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు

బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో టీజీటీ తెలుగు పోస్టు ఖాళీగా ఉందని హెచ్ఎం ధనలక్ష్మి తెలిపారు. ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5 లోపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 3, 2026
NZB: సన్నబియ్యం తూకంలో మోసాలు..!

నిజామాబాద్‌లో పలు రేషన్ దుకాణదారులు సన్న బియ్యం పంపిణీలో మోసాలకు పాల్పపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని ఓ రేషన్ దుకాణం యజమాని గన్నిసంచిలో తూకం వేస్తూ పంపిణీ చేస్తున్నారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి సుమారు 500 నుంచి 750 గ్రాములు బియ్యం గండి పడుతుంది. ఈ విషయమై పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News February 3, 2026
NZB: ఎలెక్షన్ ఎఫెక్ట్.. రూ 9 కోట్ల ఆదాయం

NZB కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని ‘నో డ్యూ సర్టిఫికేట్’ కోసం పన్నుల రూపంలో రూ.9 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తాము చెల్లించాల్సిన పన్నులు, పాత బకాయిలు సైతం చెల్లించారు. పోటీదారులతో పాటు వారిని బలపరిచే అభ్యర్థులు సైతం తమ పన్నులు చెల్లించారు. NOC కోసం 1200 మందికి పైగా నామినేషన్ల మొదటి, రెండో రోజు రూ.60 లక్షలు చివరి రోజు రూ.8.16 కోట్ల పన్నులు చెల్లించారు.
News February 3, 2026
గుత్పలో అపురూప వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

మాక్లూరు మండలం గుత్పలో కొలువైన వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4 నుంచి 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 4న అంకురార్పణ, 5న ధ్వజారోహణం, 6న స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ సేవ, 7న చక్రస్నానం, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.


