News November 11, 2025

నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.

Similar News

News February 4, 2026

NZB: ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలను మరోమారు క్షేత్రస్థాయిలో సరి చూసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

News February 4, 2026

NZB: అందుకే కాంగ్రెస్‌లోకి రాలేదు: MP

image

హిందూ వ్యతిరేకులు కనుకనే తాను కాంగ్రెస్‌లోకి రాలేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ తమ కుటుంబానికి ఎంతో దగ్గర అయినప్పటికీ తాను ఆ పార్టీ హిందూ వ్యతిరేకం కనుకనే కాంగ్రెస్‌లో చేరలేదన్నారు. తన తండ్రిని అవమానపరిచి కాంగ్రెస్ నుంచి బయటకు పంపారన్నారు. తన కార్లపై, ఇంటిపై దాడులు చేశారని మండి పడ్డారు.

News February 4, 2026

NZB: పురు పోరు…. ప్రచారం షురూ….

image

ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలనలు ఉపసంహరణలు పూర్తయ్యాయి. బీఫామ్ లు పార్టీలు అందించడంతో ఇక అభ్య ర్థుల లెక్క కూడా తేలిపోయింది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కోవార్డులో ఇద్దరికి మించి నామినేషన్లు వేశారు. అధిష్టానాల నిర్ణయం మేరకు బీ ఫామ్లు అందడంతో ప్రధాన ఘట్టం ప్రచారం మొదలైంది.