News October 21, 2024

నిజామాబాద్ జిల్లాలో కళాశాలల ఏర్పాటుకు చొరవ చూపుతా: జూపల్లి

image

నిజామాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజ్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేయించేలా, 20, 21 ప్యాకేజీల పనులను పూర్తి చేయించేలా చొరవ చూపుతానని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికగా ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News February 14, 2026

NZB: నాలుగు సార్లు ఓటమి.. ఐదో సారి గెలుపు

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఎర్రం గంగాధర్ ఈసారి 43వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంగాధర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగంపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News February 13, 2026

NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

image

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.