News November 4, 2024
నిజామాబాద్ జిల్లాలో నేడు మీ సేవలు బంద్

సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు జిల్లా మీ సేవ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు.
Similar News
News April 14, 2026
నిజామాబాద్: జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

నిజామాబాద్ ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. హెచ్‌పీవీ టీకాలు, డెంగీ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.
News April 14, 2026
NZB: టాస్ (TOSS) పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో SSC, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలు, టైమ్ టేబుల్ సిద్ధంగా ఉన్నాయన్నారు.
News April 14, 2026
ఇందల్వాయి: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఇందల్వాయి మండలం గంగారం తండా సమీపంలో ఎన్‌హెచ్-44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గంగార తండా శివారులో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


