News April 20, 2024
నిజామాబాద్ జిల్లాలో పిడుగుపాటు..నలుగురికి గాయాలు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ధర్మోర గ్రామంలో నిన్న సాయంత్రం పిడుగు పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన శివ, బన్నీ, నారాయణ, శంకర్ వడ్లు ఆరబెడుతుండగా వారిపై పిడుగు పడింది. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివ, బన్నీ హనుమాన్ మాల ధరించారు. వారిద్దరికి బలమైన దెబ్బలు తగిలినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News September 11, 2025
NZB: వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

నిజామాబాద్ సుభాష్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహేష్(32) వాహనంలో వెనుక కూర్చొని వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల మహేష్ కింద పడి గాయలపాలయ్యాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 11, 2025
నిజామాబాద్‌లో ఉద్యోగ మేళా

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూధన్‌రావు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 6305743423, 9948748428 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News September 10, 2025
NZB: GGHలో వైద్య విభాగాలను తనిఖీ చేసిన DMHO

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను DMHO డాక్టర్ బి.రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, SNCU విభాగాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరును హాజరు పట్టికలను వివిధ రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.