News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేనా?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడం లేదు. 2020లో NZB కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 4,34,701 మంది ఓటర్లకు గాను 2,79,840 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా డివిజన్లు, వార్డుల్లో 80 శాతం పోలింగ్ దాటలేదు.

Similar News

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో 61.90 శాతం పోలింగ్ నమోదు

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం వరకు 61.90 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌‌లో 59.12 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటీలో 68 శాతం, బోధన్‌లో 68.64 శాతం, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 69.78 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు.

News February 11, 2026

NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ నాగారం సమీపంలో నందిగుట్ట వద్ద ఉన్న చెరువు సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ SI ఎం.గంగాధర్ తెలిపారు. సుమారు 35-40 ఏళ్ల వ్యక్తి తామర పూల కోసం చెరువులోకి వెళ్లి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదన్నారు. మృతుడిని గుర్తిస్తే 8712659727 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

News February 11, 2026

NZB: మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం పోలింగ్

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌ లో 43.18శాతం, ఆర్మూర్ మున్సిపాలిటిలో 60.05 శాతం, బోధన్‌లో 61.77 శాతం, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 63.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 2,40,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.