News March 3, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పోతంగల్, కోటగిరిలో 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా- 38.9, లక్మాపూర్- 38.5, చిన్న మావంది, జక్రాన్‌పల్లి -38.4, ధర్పల్లి -38.3, సాలూరా, వేపూర్- 38.1, ఎడపల్లి -38, గోపన్నపల్లి- 37.9, కమ్మర్‌పల్లి, పెర్కిట్ -37.7, మంచిప్ప, రెంజల్ -37.6, వెంపల్లి, నిజామాబాద్ -37.5, తొండకూర్, కల్దుర్కి, కొండూర్- 37.3, మోర్తాడ్- 37.2, ఏర్గట్లలో 37.1℃గా నమోదైంది.
Similar News
News March 3, 2025
NZB: బాధ్యతలు తీసుకున్న జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి

ఇటీవల జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నియమించిన IAS అధికారిణి భవాని సోమవారం నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News March 3, 2025
NZB: కొడుకులు, కోడళ్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు

నవీపేట్ మండలం కోసి ఫకీరాబాద్ గ్రామానికి చెందిన గుడ్డి ముత్తమ్మ అనే వృద్ధురాలు కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదని సోమవారం ప్రజావాణిలో నిజామాబాద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భర్త చనిపోతే అక్కున చేర్చుకుని కడుపు నింపాల్సిన కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేవాలయం ఎదుట కూర్చుని యాచిస్తూ జీవనం సాగిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
News March 3, 2025
NZB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ రిజిస్ట్రార్

నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ACBదాడి జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో రెండో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామరాజు ఏసీబీకి చిక్కారు. రామరాజు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ DSP శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు సోదాలు పూర్తయ్యాక ప్రకటిస్తామని DSP తెలిపారు.