News April 13, 2025
నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్‌లు నిజామాబాద్‌లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 6, 2026
పిల్లలకు తేనె ఎప్పుడు ఇవ్వాలంటే?

పిల్లలకు ఒక సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత, వారి జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అప్పుడు తేనె ఇవ్వడం సురక్షితం. కానీ అప్పుడు కూడా దీనిని తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహారం మాదిరిగా ముందుగా కొద్దిగా ప్రయత్నించి చూడాలి. పిల్లల గొంతుకు ఉపశమనం కలిగించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇచ్చే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. దానికి బదులు తల్లి పాలు, సూప్‌లు, జ్యూసులు ఇవ్వడం మంచిది.
News January 6, 2026
GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.
News January 6, 2026
31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.


