News December 29, 2025

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కలు ఇవే!

image

నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్‌లో 60 వార్డులు ఉండగా 3,11,152 జనాభా ఉంది. అందులో SCలు 23,788, STలు 3,425 ఉన్నారు. బోధన్‌లో 38 వార్డుల్లో 82,744 జనాభా ఉండగా SCలు 6,704, STలు 890 ఉన్నారు. ఆర్మూర్‌లో 36 వార్డుల్లో 67,252 మంది ఉండగా ఎస్సీలు 5,625, ఎస్టీలు 886 నమోదయ్యారు. భీమ్‌గల్‌లో 12 వార్డుల్లో 15,446 మంది ఉండగా ఎస్సీలు 1,957, ఎస్టీలు 696 ఉన్నారు.

Similar News

News December 29, 2025

NZB: 21 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 21 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.

News December 29, 2025

నిజామాబాద్: ప్రజావాణికి 93 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News December 29, 2025

నవీపేట్: అంగన్వాడి సెంటర్లో పేలిన కుక్కర్

image

నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ అంగన్వాడీ సెంటర్లో సోమవారం కుక్కర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని రెంజల్ 108 సిబ్బంది లక్ష్మణ్, నయీమ్ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల కోసం కుక్కర్లో పప్పు ఉడికిస్తున్న సమయంలో అది పేలి సమీపంలోని ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. వంట చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లలను దూరంగా ఉంచాలని గ్రామస్థులు కోరారు.