News July 2, 2024

నిజామాబాద్ జిల్లాలో 1,321 మంది ఉపాధ్యాయుల బదిలీ

image

జిల్లా వ్యాప్తంగా 1,321 మంది ఎస్టీటీలను బదిలీ చేస్తూ డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ గతేడాది జనవరిలో ప్రారంభం కాగా సోమవారంతో ముగిసింది. వారితో పాటు మరో 46 మంది భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 25 ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 7, 2024

NZB: ‘పరిమితులకు లోబడి DJ యాజమాన్యం వ్యవహారించాలి’

image

పోలీస్ శాఖ పరిమితులకు లోబడి DJ యాజమాన్యం వ్యవహారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చి నిజామాబాద్‌లో ఇబ్బంది పెడుతున్నట్టు DJ వాళ్లపై చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు, సీనియర్ సిటిజన్స్‌కు ఇబ్బందులు కలగకుండా చట్ట పరిధిలో రెండు సౌండ్ బాక్స్ సిస్టమ్‌లు వాడలన్నారు.

News October 6, 2024

తాడ్వాయి: గ్రేట్.. మూడు ఉద్యోగాలు సాధించాడు.!

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రాజశేఖర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. SA సోషల్, SA తెలుగు, ఎస్జీటి గురుకుల టీజీటీ పోస్టులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు పలు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News October 6, 2024

NZB: నాలుగు క్వింటాళ్ల పండ్లతో అన్నపూర్ణ దేవీగా అమ్మవారు

image

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్‌లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.