News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో 2 గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో పోలింగ్ శాతం 15% కూడా దాటలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 9 గంటల వరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 6.49 శాతం, బోధన్ మున్సిపాలిటీలో 14.24 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటీలో 11.05శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 9.38 శాతం పోలింగ్ నమోదైంది.

Similar News

News February 11, 2026

NZB: ఒంటి గంట వరకు 39.68 శాతం పోలింగ్

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు ఓవరాల్‌గా 39.68 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌ లో 35.49 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటిలో 47.93 శాతం, బోధన్‌లో 50.69 శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 51.53 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,96,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

News February 11, 2026

నిజామాబాద్: పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యవేక్షణ

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం సీపీ సాయి చైతన్య పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, చంద్రశేఖర్ కాలనీ, కోటగల్లి తదితర ప్రాంతాల్లోని బూత్‌లను సందర్శించి భద్రతను సమీక్షించారు. సీపీ స్వయంగా ఓ వృద్ధుడిని వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 11, 2026

NZB: 11 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11 గంటల వరకు ఓవరాల్‌గా 22.54 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌ లో 18.94శాతం, BDNలో 32.35%, ARMRలో 29.60%, BMGL మున్సిపాలిటీలో 31.09% పోలింగ్ నమోదైంది. జిల్లాలో 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,11, 681మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.