News August 15, 2024
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతం

బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం బంద్ విజయవంతమైంది. నిజామాబాద్‌లో బైక్‌ర్యాలీని గాంధీచౌక్ నుంచి బస్టాండ్, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, హైదరాబాద్ రోడ్డు మీదుగా కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి శివాజీ చౌక్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Similar News
News December 30, 2025
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
News December 30, 2025
హైదరాబాద్‌పై నిజామాబాద్ గెలుపు

కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నీలో NZB జట్టు HYDపై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన NZB జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన HYD జట్టు 9 వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో NZB జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.
News December 30, 2025
మెండోరా: ట్రాక్టర్ ఢీకొని టీచర్ మృతి

మెండోరా మండలం పోచంపాడ్ సమీపంలో తెలంగాణ సొషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో టీచర్‌గా పని చేస్తున్న ప్రియాంక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు. బైక్ మీద వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టిందన్నారు. చికిత్స నిమిత్తం నిర్మల్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారన్నారు


