News March 31, 2025
నిజామాబాద్ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Similar News
News April 1, 2025
NZB: ప్రభుత్వ తీరుపై MP ఫైర్

HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్పా ఏమీ తెలియదు.. అందుకే హెచ్సీయూ భూములను వేలం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని NSUI కూడా వ్యతిరేకిస్తోందని అన్నారు. భూముల విషయంలో రాహుల్ గాంధీ కమీషన్ తీసుకోకపోతే రేవంత్ ఆపాలని వ్యాఖ్యానించారు.
News April 1, 2025
NZB:రేపు ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2న నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా స్థాయి U-20 మహిళా, పురుషుల రెజ్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల డిఎస్ఏ స్విమ్మింగ్ రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనేవారు ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ వెంట తేవాలన్నారు.
News April 1, 2025
NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.