News March 6, 2026
నిజామాబాద్ జిల్లా యువకుడికి సివిల్స్‌లో 259వ ర్యాంక్

భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 259వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో కష్టపడి ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న వర్షిత్ రెడ్డిని గ్రామస్థులు, యువత అభినందించారు. జిల్లాకే గర్వకారణంగా నిలిచారన్నారు. తన ప్రతిభతో గ్రామానికి పేరు తెచ్చిన వర్షిత్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు గ్రామస్థులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.