News April 15, 2024
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో తనిఖీలు
నిజామాబాద్ నగరం, జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నుంచి అప్పు తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 8, 2025
NZB: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించిన నేతలు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడం, అక్కడి పుస్తకంలో సంతకం చేసేందుకు చూడగా ఆయన పేరు లేకపోవడంతో అలిగి స్టేజ్ దిగిపోయారు. దీనితో కాంగ్రెస్ నాయకులు ఆయన్ను బుజ్జగించి తిరిగి స్టేజి పైకి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News January 8, 2025
NZB: ఓపిక పడితే.. అవే దక్కుతాయి: మహేష్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓపిక పట్టాలని.. అప్పుడే పదవులు దక్కుతాయని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలోని డిచ్పల్లిలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు నిరాశకు గురి కావద్దని, పదవులు ఖచ్చితంగా దొరుకుతాయని సూచించారు. తనకు PCCపదవి దక్కేందుకు 35 సంవత్సరాలు పట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు
News January 8, 2025
డిచ్పల్లి: ఓట్లు వేసేది ప్రజలు.. ఓట్లు వేయించేది మీరు: మంత్రి జూపల్లి
ఓట్లు వేసేది ప్రజలు.. ఓట్లు వేయించేది కార్యకర్తలు, నాయకులు అని నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గత BRS ప్రభుత్వ అవినీతిని ప్రజలకు విడమరిచి చెప్పాలని, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు.