News November 18, 2025
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో నాసిరకం భోజనం..?

NZB జిల్లా డిచ్‌పల్లి పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో వంటల్లో నాసిరకం సరకులు వాడుతున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీలోని హాస్టల్ విద్యార్థులు వంట సామగ్రి నాణ్యతపై నిరసన తెలియజేశారు. ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్‌లో వంటకాలను తయారు చేయడానికి నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత గల సరకులు వినియోగిస్తున్నారని, దీనివల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని విద్యార్థులు వాపోయారు.
Similar News
News November 18, 2025
టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.

ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగు

ఆన్‌లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్‌ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్‌కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్‌లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.