News April 21, 2025

నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

Similar News

News April 21, 2025

NZB: ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం: షబ్బీర్ అలీ

image

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ తన కుటుంబ అభివృద్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

News April 21, 2025

NZB: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో నిజామాబాద్‌లోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

News April 21, 2025

NZB: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో NZBలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

error: Content is protected !!