News February 11, 2025

నిజామాబాద్: నిర్యుదోగ మహిళలకు ఉచిత శిక్షణ

image

SC కార్పొరేషన్ ద్వారా SC నిర్యుదోగ మహిళలకు న్యాక్ నిజామాబాద్ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ జె.లింబద్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ టవర్స్ పక్కన ఉన్న శిక్షణ కేంద్రంలో ఫిబ్రవరి 12లోపు సంప్రదించలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు కుట్టు మిషన్ ఉచ్చితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

Similar News

News March 14, 2025

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా లక్మాపూర్, మోస్రా, మగ్గిడి, ఎర్గట్ల ప్రాంతాల్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మల్కాపూర్, ఆలూర్, గోపన్నపల్లి, వెంపల్లె, తొండకూర్లో 40℃, మాచర్ల, మోర్తాడ్, నిజామాబాద్, మెండోరా 39.9, పోతంగల్, కోటగిరి 39.8, పెర్కిట్ 39.7, మంచిప్ప 39.6, నందిపేట 39.5, ఇస్సాపల్లె, ఎడపల్లె 39.4, బాల్కొండ, జానకంపేట్ 39.2, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లిలో 39.1℃గా నమోదైంది.

News March 14, 2025

NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి 

image

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.

News March 14, 2025

బోధన్: కోచింగ్ లేకుండా GOVT జాబ్ సాధించారు..!

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ వాసి గుడ్ల సాయిప్రసాద్ బోధన్ జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. ఎలాంటి కోచింగ్ సెంటర్ వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో పాఠాలు విని జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి సునీత, సోదరి ప్రియాంక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు సాయిప్రసాద్ తెలిపారు.

error: Content is protected !!