News December 29, 2025

నిజామాబాద్: నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌ కిరణ్

image

నిజామాబాద్ పట్టణానికి చెందిన శ్రీనికేష్ కిరణ్ 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.

Similar News

News January 1, 2026

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ GOపై హైకోర్టు నోటీసులు

image

AP: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై జారీచేసిన GO 225పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు ఈ నోటీసులిచ్చింది. PILపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

News January 1, 2026

విజయవాడ మహిళకు అమెరికాలో అదనపు కట్నం వేధింపులు.!

image

విజయవాడలోని అంబాపురానికి చెందిన ఓ మహిళ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లిలో ₹40 లక్షల నగదు, ₹25 లక్షల బంగారం ఇచ్చినా, అమెరికా వెళ్లాక కూడా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనను చిత్రహింసలకు గురిచేయడంతో ఒత్తిడికి లోనై శిశువును కోల్పోయినట్లు తెలిపింది. వేధింపులు తాళలేక స్వదేశానికి తిరిగి వచ్చి భర్త, కుటుంబంపై పోలీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

News January 1, 2026

UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

image

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌‌ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.