News December 13, 2025

నిజామాబాద్: పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: బీజీపీ అధ్యక్షుడు

image

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యనారాయణ రూ.138 కోట్ల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన శూన్యమన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Similar News

News December 14, 2025

NZB: రెండో విడతకు అధికారులు ఎంత మందో తెలుసా?

image

NZBజిల్లాలో 2వ విడతలో ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. మొత్తం 2,38,838 మంది ఓటర్లు ఉండగా 1,476 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీవోలు 1,476 మంది, ఓపీవోలు 1937, మైక్రో అబ్జర్వర్లు 56, జోనల్ అధికారులు 34 మంది విధుల్లో ఉంటారు. సిబ్బంది తరలింపునకు 53 రూట్లు కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

News December 14, 2025

చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

image

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్‌ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

News December 14, 2025

నిజామాబాద్: వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

image

గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.