News March 19, 2024

నిజామాబాద్: పరీక్ష తేదీలు వెల్లడి

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి.పి.ఎడ్ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 26న ప్రారంభమై 30 తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య.ఎం.అరుణ తెలిపారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్
www.telanganauniversity.ac.in చూడాలని విద్యార్థులకు సూచించారు.

Similar News

News December 18, 2025

NZB: ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థిని మృతి

image

మెండోరా(M) పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ముప్కాల్‌కు చెందిన సాయి లిఖిత HYD చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 5న బాలిక వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని, ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలఎదుట మృతదేహంతో నిరసనకు యత్నించారు.

News December 18, 2025

నిజామాబాద్: మూడో స్థానంలో స్వతంత్రులు

image

నిజామాబాద్ జిల్లాలో జరిగిన లోకల్ దంగల్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. జిల్లాలో మూడు విడతల్లో 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలతో కలుపుకొని 362 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొంది మొదటి స్థానంలో నిలవగా, 76 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 60 మంది స్వతంత్రులు గెలిచి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 47 గ్రామాల్లో బీజేపీ చివరగా ఉంది.

News December 18, 2025

NZB: మూడు దశల్లో మహిళలే ఎక్కువ

image

నిజామాబాద్ జిల్లాలో మూడు దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వేశారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా 6,15,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,49,574 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 2,65,679 మంది, ఇతరులు నలుగురు ఓటేశారు.