News June 18, 2024

నిజామాబాద్ ప్రజలకు CP సూచనలు

image

NZB జిల్లా ప్రజలకు CP కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. A సర్టిఫికెట్ సినిమాలకు థియేటర్‌లోకి బాలలను అనుమతించకూడదన్నారు.. జిల్లాలో ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాల్లో, కళ్యాణ మండపాల్లో డీజేలు నిషేధమని పేర్కొన్నారు. బహిరంగ సభలకు ACP వద్ద లేదా CP వద్ద, విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు స్టాచ్యూ కమిటీ సిఫార్సు తప్పనిసరన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్‌లో ఎంక్వయిరీ చేయాలని సూచించారు.

Similar News

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

News September 14, 2025

త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

image

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.

News September 13, 2025

NZB: హైకోర్టు జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వారితో భేటీ అయ్యారు. జడ్జీలు నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శిచగా కలెక్టర్ వారితో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.