News March 22, 2025

నిజామాబాద్: ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

లేఔట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎఫ్‌టీఎల్, నిషేధించిన సర్వే నంబర్లు మినహా దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించిందని కలెక్టర్ సూచించారు

Similar News

News February 12, 2026

NZB: నాలుగు కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్: సీపీ

image

నిజమాబాద్‌లో జరిగిన 2వ సాధారణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఈ మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ సాయి చైతన్య గురువారం తెలిపారు. మొత్తం నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్(బాలుర, నిజామాబాద్), విజయ మేరీ హైస్కూల్(బోధన్), ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పిప్రి, ఆర్మూర్), ప్రభుత్వ జూనియర్ కళాశాల(భీమ్‌గల్)లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వివరించారు.

News February 12, 2026

నందిపేట్: ఇద్దరి మృతి.. రెండు కుటుంబాల్లో విషాదం

image

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరుశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శివ (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈనెల 2న నందిపేట్–కొండూరు మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొడుపల సాగర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శివ కూడా బుధవారం మృతి చెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News February 12, 2026

భీంగల్‌లో అత్యధికం.. నిజామాబాద్‌లో అత్యల్పం

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భీమ్‌గల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 69.78 శాతం పోలింగ్ నమోదవ్వగా NZB కార్పొరేషన్‌‌లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆర్మూర్ మున్సిపాలిటీలో 68%, బోధన్‌లో 68.64 % నమోదైంది. భీంగల్‌లో 14,045 ఓట్లకు గాను 9,800 ఓట్లు, NZBలో 3,48,951 ఓట్లకు గాను 2,05,753 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు 3,06,697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.