News October 27, 2024

నిజామాబాద్: ప్రముఖ వైద్యులు బాపురెడ్డి కన్నుమూత

image

ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాల బాపురెడ్డి(75) అనారోగ్యంతో కన్నుముశారు. గత కొంతకాలంగా లివర్ సెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న డా. బాపురెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాలకు పైగా వైద్య సేవలందించిన బాపురెడ్డి జిల్లాలో సుపరిచితుడు. పూర్వపు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన డా.బాపురెడ్డి నిజామాబాద్ కేంద్రంగా ఎండి, ఫిజీషియన్ వైద్యులలో ప్రముఖులు.

Similar News

News October 20, 2025

మెండోరా: నీటిలో మండుతున్న సూర్యుడు

image

సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు ఎరుపెక్కిన దృశ్యాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్‌పై నుంచి చూస్తే నీటిలో నిప్పు కనిక మండుతున్నట్లుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పర్యాటకులు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్లలో ఫొటోలను చిత్రీకరించారు. నీటిలో నుంచి మండుతున్న అగ్నిపైకి వస్తున్నట్లు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది.

News October 19, 2025

NZB: 23 వరకు వైన్స్‌లకు దరఖాస్తుల స్వీకారం: ES

image

నిజామాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 27న డ్రా తీస్తారని చెప్పారు. కాగా జిల్లాలోని 102 వైన్స్‌లకు సంబంధించి నిన్నటి వరకు 2,633 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 907, బోధన్ 427, ఆర్మూర్ 577, భీమ్‌గల్ 355, మోర్తాడ్ పరిధిలో 366 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

News October 19, 2025

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

image

దీపావళి పండుగను పురస్కరించుకుని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.