News January 16, 2026

నిజామాబాద్ ఫస్ట్.. నల్గొండ సెకండ్

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 5.23 లక్షల టన్నులతో జిల్లా రెండో స్థానంలో ఉండగా, 6.93 లక్షల మెట్రిక్ ​టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారంలోగా నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపలేదు.

Similar News

News April 13, 2026

వాన్స్ నాకు కాల్ చేశారు: నెతన్యాహు

image

శాంతి చర్చలు విఫలమైన తర్వాత తిరుగు పయనంలో వాన్స్ తనతో మాట్లాడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవడంతో పాటు భవిష్యత్తులో ఆ దిశగా అడుగులు వేయబోమన్న హామీని ఇరాన్ నుంచి కోరామని వాన్స్ వివరించినట్లు చెప్పారు. దీని కేంద్రంగానే చర్చలు జరిగినట్లు తెలిపారని వెల్లడించారు. నెతన్యాహు నుంచి <<19635452>>కాల్ రావడం<<>> వల్లే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

News April 13, 2026

NZB: లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి: ACB

image

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని NZB ACB డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ సూచించారు. కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలు నేరుగా వచ్చి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. అవినీతిపై సమాచారం ఇచ్చే వారు 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా 91543-88950 (DSP), CI 91543-88923, 91543-88951 నంబర్లను సంప్రదించాలన్నారు.

News April 13, 2026

భూపాలపల్లి: రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, అధిక వేగాన్ని నియంత్రించాలని సూచించారు.