News February 20, 2025
నిజామాబాద్: ‘బాల్య వివాహాలు లేని జిల్లాగా చేయండి’

జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్‌లో భాగంగా సాధన స్వచ్ఛంద సంస్థ సిబ్బంది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుని బుధవారం కలిశారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్, నవీపేట్, బోధన్, భీమ్‌గల్ మండలాల సోషల్ మొబిలైజర్ చరణ్ సింగ్, సాయి చరణ్ గౌడ్, నిరీక్షణ ఉన్నారు.
Similar News
News February 14, 2026
NZB: 16న మేయర్ ఎన్నిక కోసం ఏర్పాట్లు

ఈ నెల 16న (సోమవారం) నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. NZB ACP ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. కాగా మొదట మేయర్ ఎన్నిక జరుగుతుంది. తదనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది.
News February 14, 2026
NZB: మేయర్ బరిలో బీసీ అభ్యర్థులు..!

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శమంత పేరు వినిపించినప్పటికీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు తాజాగా బీసీ నినాదంతో 2 కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి (ముదిరాజ్), 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేర్లు వినిపిస్తున్నాయి.
News February 14, 2026
దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.


