News July 5, 2025

నిజామాబాద్: భారీ వర్షాల జాడేదీ?

image

వర్షాకాలం మెుదలై నెలరోజులు దాటినా ఉమ్మడి NZB జిల్లాలో భారీ వర్షాలు కురవటం లేదు. దీంతో చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావటం లేదు. అయినప్పటికీ రైతులు వరినాట్లు వేస్తున్నారు. KMR జిల్లాలో 5,21,448 ఎకరాల్లో పంట సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ నెలలోనే చెరువుల్లోకి సగానికి పైగా వరద నీరు రాగా ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రావటం లేదని రైతులు పేర్కొంటున్నారు.

Similar News

News July 5, 2025

పాలకొల్లు: మూడు రోజుల వ్యవధిలో తల్లి కూతురు మృతి

image

పాలకొల్లులో ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో సంగినీడి జయశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ ఆరోజు బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపించేశారు. శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News July 5, 2025

GWL: సీడ్ కంపెనీల షరతులను వ్యతిరేకిస్తూ ధర్నా

image

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు పత్తి విత్తన కొనుగోలుపై విధిస్తున్న షరతులను వ్యతిరేకిస్తూ ఈనెల 7న గద్వాల పాత బస్టాండ్‌లో రైతులతో ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు శనివారం తెలిపారు. ఆర్గనైజర్లు ప్రారంభంలో ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చి నెల రోజుల పైరు తర్వాత సీడ్ కొనుగోలు విషయంలో షరతులు విధించడం సరైనది కాదన్నారు. రైతులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.

News July 5, 2025

నిర్మల్ రూరల్: ‘విద్యార్థుల సంఖ్య ఉన్నా పాఠశాల లేదు’

image

విద్యా శాఖ నియమ నిబంధనల ప్రకారం జనావాసాలకు కిలోమీటర్ పరిధిలో 20 మంది బడి ఈడు పిల్లలుంటే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. కానీ నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల వద్ద సుమారు 70మంది బడి ఈడు పిల్లలు ఉన్నారు. గతేడాది బడి ఏర్పాటు చేయాలని వినతులు కూడా సమర్పించారు. రాష్ట్రంలో 63, జిల్లాలో2 కొత్త పాఠశాలలు మంజూరు చేసినా ప్రభుత్వం ఇక్కడ పాఠశాల మంజూరు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.