News November 1, 2025

నిజామాబాద్: భార్యను చంపేసిన భర్త

image

సంగారెడ్డి(D) పటాన్‌చెరు (M) అమీన్‌పూర్ PS పరిధి వడక్‌పల్లి గ్రామ శివారులో భార్యను భర్త చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన బానోతు రాజు(48), భార్య భానోత్ సరోజ(44) 6 నెలల కిందట బతుకుదెరువు నిమిత్తం అమీన్‌పూర్‌కు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో భార్యను తలపై కట్టెతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. మృతురాలికి ఇద్దరు సంతానం.

Similar News

News November 1, 2025

ప‌ర్యాట‌క ప్రాంతాలను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

న‌గ‌రంలోని పార్కుల‌ను, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను మ‌రింత ఆక‌ర్షణీయంగా తీర్చిదిద్దాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జ‌రిగే ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 1, 2025

జగిత్యాల జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

image

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 1 నుంచి 30 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, నిరసనలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారం కోరారు.

News November 1, 2025

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందమూ సీఎంతో సమావేశమైంది. HYDలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని రేవంత్ కోరారు. సీఎం నివాసంలోనే ఈ భేటీ జరిగింది.