News November 5, 2025

నిజామాబాద్: మహిళపై వేధింపులు.. ఇద్దరిపై కేసు నమోదు: SI

image

ఆయిల్ గంగాధర్, కొండా అమర్ అనే వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ వెంటపడుతూ, వేధిస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిరువురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని NZB 4వ టౌన్ SI కె.శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. కాగా బాధితురాలు సోమవారం ఓ వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను వేధిస్తున్నారని CPకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.

News November 5, 2025

మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

image

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 5, 2025

ఉట్నూర్: ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపఃల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9885762227, 9321825562ను సంప్రదించాలాన్నారు