News November 22, 2025

నిజామాబాద్: మహిళా CIకి బెదిరింపులు.. CPకి ఫిర్యాదు

image

భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై NZB ఎక్సైజ్ CI స్వప్న CP సాయిచైతన్యకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తిసంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని CI స్వప్న CPకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Similar News

News November 22, 2025

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య అప్డేట్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి స్పష్టతనిచ్చారు. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో మాట్లాడుతూ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ తనతో కలిసి నటించనున్నట్లు ధ్రువీకరించారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో జోష్ నెలకొంది. గతంలో మోక్షజ్ఞ ప్ర‌శాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో డెబ్యూ చేస్తాడని అనుకున్నా ఆ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్‌డేట్స్ లేవు.

News November 22, 2025

MBNR: పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బీఏ,బీకాం,బీఎస్సీ, బీబీఏ బీఎ(L) (CBCS) సెమిస్టర్-I, III, V రెగ్యులర్, బ్యాక్‌లాక్ ఎగ్జామినేషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్‌కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఆర్డర్ కాపీలను అందజేశారు. వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు.

News November 22, 2025

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్…!

image

ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి 22,265 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్‌కు సంబంధించి 19,163 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలతో కలిపి 183 కళాశాలలు ఉన్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేలు ఫైన్‌తో 25వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.