News February 25, 2025
నిజామాబాద్: మిర్చికి మాత్రం రూ.25 వేల మద్దతు ధర సాధించాలి: కవిత

‘ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతారా.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటారా.. ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ కచ్చితంగా రూ.25 వేల మద్దతు ధర సాధించాల్సిందే’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మిర్చి ధరలు తగ్గగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి లొల్లి లొల్లి చేశారని గుర్తు చేశారు.
Similar News
News February 25, 2025
నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మరణించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. భవానిపేట వాసి మాగిరి లింగారం(57) తన ద్విచక్ర వాహనంపై చేపలను అమ్మి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేశ్ తెలిపారు.
News February 25, 2025
NZB: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు: ఆర్ ఎం

మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ నెల 25, 26, 27 తేదీల్లో NZB, KMR, ఆర్మూర్ నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ RM జ్యోత్స్న సోమవారం తెలిపారు. మొత్తం రీజియన్ పరిధిలో 136 బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయానికి, మద్దికుంట బుగ్గ లింగేశ్వర, కొమురవెల్లి మల్లన్న సన్నిధికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఈసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 25, 2025
NZB: మద్యం ప్రియులకు షాక్..

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ నిర్వహించాలని ఎక్సైజ్ సీఐ దిలీప్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను మద్యం వ్యాపారులు తప్పనిసరిగా అమలు పరచాలని సూచించారు.