News January 17, 2026
నిజామాబాద్: మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms.telangana.gov.inలో సంప్రదించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 2, 2026
నిజామాబాద్: సమయస్ఫూర్తి చూపిన సిబ్బందిని అభినందించిన సీపీ

సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా అపస్మారక స్థితికి వెళ్లిన ప్రయాణికుడికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బంది దస్తయ్య, అదే విధంగా అంబులెన్స్‌కు మార్గం క్లియర్ చేసిన వినోద్‌లను జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో అభినందించారు. వారు చూపిన సమయస్ఫూర్తిని కొనియాడారు.
News February 2, 2026
NZB: పార్టీలు మారుతారని ప్రకటించడం లేదా?

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేటర్లుగా పోటీ చేసే తమ అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నేటి వరకు ప్రకటించలేదు. ఇరు పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు పార్టీల పేరు చెప్పి నామినేషన్లు వేసినప్పటికీ వారికి బీఫారాలు ఇంకా అందజేయ లేదు. ముందుగా ప్రకటిస్తే ఆశావహులు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయని భావించి రేపు నామినేషన్ల విత్ డ్రా అయ్యాక బీఫారం ఇచ్చేందుకు సిద్ధం చేశాయి.
News February 2, 2026
NZB: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున జాగృతి అభ్యర్థులు

జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము మంచి అభ్యర్థులను పెట్టామని వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయాలని, మనకు పనిచేసేటోళ్లను గెలిపించాలన్నారు. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా మనం నష్టపోతామని ఆమె అన్నారు.


