News February 20, 2025
నిజామాబాద్: రాష్ట్రంలో BRS అధికారంలోకి రావడం కలనే: మహేశ్

తెలంగాణలో ఇక BRS అధికారంలోకి రావడం కలనే అని, రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ.. BRS, BJP నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష లీడర్ హోదాను KCR.. KTR, హరీశ్రావ్కు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Similar News
News December 29, 2025
నిజామాబాద్: ప్రజావాణికి 93 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News December 29, 2025
నవీపేట్: అంగన్వాడి సెంటర్లో పేలిన కుక్కర్

నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ అంగన్వాడీ సెంటర్లో సోమవారం కుక్కర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని రెంజల్ 108 సిబ్బంది లక్ష్మణ్, నయీమ్ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల కోసం కుక్కర్లో పప్పు ఉడికిస్తున్న సమయంలో అది పేలి సమీపంలోని ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. వంట చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లలను దూరంగా ఉంచాలని గ్రామస్థులు కోరారు.
News December 29, 2025
NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.


