News August 17, 2025
నిజామాబాద్: రూ. 57.98 కోట్ల పెన్షన్ల పంపిణీ

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.
Similar News
News August 17, 2025
నిజామాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఎన్నంటే?

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇక జనవరి నుంచి పౌర సరఫరా రంగంలో 11,852 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని అధికారులు తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,19,330 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి ప్రభుత్వం రూ.30.73 కోట్ల సబ్సిడీ అందించిందని వెల్లడించారు.
News August 17, 2025
NZB: 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.
News August 17, 2025
NZB: చర్చీలు, మైనారిటీల అభివృద్ధికి నిధులు ఎన్నంటే?

మైనారిటీ సంక్షేమానికి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 53 చర్చిల నిర్మాణం, వాటి ప్రహరీ గోడల పనులకు రూ.7.18 కోట్లు కేటాయించారు. అలాగే, 53 ఉర్దూ ఘర్ కం-షాదీఖానాల నిర్మాణ పనులకు రూ.7.85 కోట్లు పరిపాలన మంజూరు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నిధులు జిల్లాలోని మైనారిటీల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనున్నాయని తెలిపారు.