News December 2, 2025

నిజామాబాద్: రెబల్స్‌తో ప్రధాన పార్టీల్లో ‘ఫియర్’..!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పార్టీలకు రెబల్స్ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. ఎలాగైనా సర్పంచ్ కావాలనే పట్టుదలతో పార్టీలోనే కొందరు అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. వీరు ఉపసంహరణకు నిరాకరించి, పోటీలో నిలిచే తీరుతామని భీష్మించుకుంటున్నారు. దీంతో ఓట్లు చీలి, విజయం కష్టమవుతుందని భావిస్తున్న సీనియర్‌ నాయకులు, వారిని విత్‌డ్రా చేయించేందుకు మంతనాలు జరుపుతున్నారు.

Similar News

News April 13, 2026

సంగారెడ్డి: బీటెక్ విద్యార్థి మృతి.. ఐదుగురికి పునర్జన్మ

image

తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం చేశారు సంగారెడ్డి మం. కోత్లాపూర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ (21). బీటెక్ పూర్తి చేసిన ఉదయ్ ఈనెల 4న బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆ పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో ఉదయ్ అవయవాలు సేకరించి ఐదుగురు బాధితులకు అమర్చి పునర్జన్మ ప్రసాదించారు.

News April 13, 2026

‘వనజీవి’ రామయ్యకు దక్కని గౌరవం

image

కోటికి పైగా మొక్కలు నాటి పద్మశ్రీ అందుకున్న ‘వనజీవి’ రామయ్య ప్రథమ వర్ధంతిని పాలకులు, అధికారులు విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బతికున్నప్పుడు ఫొటోల కోసం పోటీపడిన నేతలు, నేడు నివాళులర్పించేందుకు రాకపోవడంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పర్యావరణం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడిని ఏడాదిలోనే మరచిపోవడం విచారకరమని ప్రజలు వాపోతున్నారు.

News April 13, 2026

విశాఖ: టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్..!

image

GVMC పరిధిలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రతి సోమవారం PGRSలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. 2 నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు, నాయకులు వేధింపులు తాళలేక కంచరపాలెంలో ఒక వ్యక్తి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇటీవల టౌన్ ప్లానింగ్‌ శాఖపై ACB దాడులు కలకలం సృష్టించాయి. గత కలెక్టర్ కూడా ఈ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విశాఖ ప్రజలు టౌన్ ప్లానింగ్‌ సిబ్బందిపై మీ కామెంట్ తెలపండి.