News December 13, 2024
నిజామాబాద్: విధుల నుంచి తొలగిస్తే పోరాటం తప్పదు: MLC కవిత
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని NZB ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ విషయంలో తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందని, అదే జరిగితే మరో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని ఆమె ‘X’ వేదికగా గురువారం హెచ్చరించారు. విధుల నుంచి తొలగించాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీ కామెంట్?
Similar News
News December 26, 2024
NZB: జల్సాల కోసం బైకు దొంగతనాలు
నిజామాబాద్ జిల్లాలో జల్సాలకు బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నిజామాబాద్, కోరుట్ల, నవీపేటలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూ.2.5 లక్షల విలువ చేసే 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
News December 26, 2024
రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసింది: కవిత
రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె విమర్శించారు.
News December 25, 2024
NZSR: భార్యను కత్తితో నరికి చంపిన భర్త
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బుధవారం దారుణం జరిగింది. మండలంలోని అవుసుల తండాలో నివాసం ఉంటున్న మెగావత్ మోతి బాయి(55)ని భర్త షేర్య కత్తితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు సంబంధిచిన పూర్తి వివరాలను తరువాత వెల్లడించనున్నట్లు ఎస్సై తెలిపారు.