News February 28, 2025
నిజామాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి NZB, KNR, MDK, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News February 28, 2025
మల్దకల్: అమ్మా, నాన్న లేక అనాథలయ్యారు!

మల్దకల్ మండలం చర్లగార్లపాడులో అనారోగ్యంతో తల్లి, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మృతి చెందగా ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కుమ్మరి వీరేశ్, భారతి కుండలు చేస్తూ జీవిస్తున్నారు. భారతి జనవరి 16న అనారోగ్యంతో మృతి చెందింది. భార్య లేని లోటు, ఆర్థిక ఇబ్బందులతో వీరేశ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు అంటున్నారు.
News February 28, 2025
బ్లడ్‌బాత్: రూ.50లక్షల కోట్లు హాంఫట్

అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెప్టెంబర్ నాటి గరిష్ఠ స్థాయుల నుంచి బెంచ్‌మార్క్ సూచీలు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో ₹50లక్షల కోట్ల సంపద ఆవిరైంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 గరిష్ఠ స్థాయి నుంచి 25% పతనమవ్వడంతో ₹5.25లక్షల కోట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 పీక్ నుంచి 21% తగ్గడంతో ₹13.35లక్షల కోట్లు కరిగిపోయాయి. ఇక నిఫ్టీ50 14% క్రాష్ అవ్వడంతో ₹31.94లక్షల కోట్ల నష్టం వచ్చింది.
News February 28, 2025
OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్ గడువు పెంపు

OU ప్రొఫెసర్ రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో UG, PG విద్యార్థుల అసైన్మెంట్ గడువు మార్చి 29 వరకు పొడిగించారు. విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించి, రసీదు జతచేసి (చేతిరాతతో రాసినవి మాత్రమే) అసైన్మెంట్‌ను సమర్పించాలి. జిరాక్స్ కాపీలు, ఫొటోకాపీలు, టైప్ చేసినవి చెల్లవు. గడువు దాటితే స్వీకరించరని అధికారులు స్పష్టం చేశారు. మొదటి గడువు తేదీ మార్చి 5గా ప్రకటించారు. తాజాగా దానిని పొడిగించారు.